
హైదరాబాద్, 25 సెప్టెంబర్ (హి.స.)
నాగర్కర్నూల్ జిల్లా కలెక్టర్ హేమంత్ కేశవ్ పాటీల్ శుక్రవారం కొల్లాపూర్ నియోజక వర్గంలోని గ్రామాలలో పర్యటించి పలు అభివృద్ధి పనులను క్షేత్రస్థాయిలో పరిశీలించారు.
పెంట్లవెల్లి మండలం వేంకల్, మల్లేశ్వరం గ్రామాల్లో పర్యటించిన కలెక్టర్ ముందుగా వేంకల్ గ్రామంలోని అంగన్వాడీ కేంద్రాన్ని పరిశీలించారు. కేంద్రంలో చిన్నారులకు అందుతున్న సేవలు, మౌలిక వసతులు, తాగునీరు, పారిశుధ్యం తదితర అంశాల పై సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు.
అనంతరం గ్రామంలో నిర్మిస్తున్న వీవో భవన నిర్మాణ పనులను కలెక్టర్ పరిశీలించారు. నిర్మాణ పనుల ప్రస్తుత పురోగతి, ఇప్పటివరకు పూర్తయిన పనులు, ఇంకా చేపట్టాల్సిన పనుల వివరాలను జిల్లా కలెక్టర్ అధికారులను అడిగి తెలుసుకున్నారు. నిర్మాణ పనుల్లో జాప్యం లేకుండా నిర్ణీత గడువులోగా పనులు పూర్తి చేసి భవనాన్ని అందుబాటులోకి తీసుకురావాలని కలెక్టర్ సూచించారు.
ప్రజలకు ఉపయోగపడే ప్రభుత్వ భవనాల నిర్మాణంలో నాణ్యతతో పాటు పనుల వేగానికి కూడా ప్రాధాన్యత ఇవ్వాలని తెలిపారు. అనంతరం వేంకల్ గ్రామంలో కొనసాగుతున్న రీ సర్వే ప్రక్రియను పరిశీలించారు. రీ సర్వే ప్రక్రియను పారదర్శకంగా, పకడ్బందీగా, తప్పులు లేకుండా నిర్వహించాలని కలెక్టర్ సూచించారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..