ఎలుకలు కరిచి అస్వస్థతకు గురైన విద్యార్థినులు....ఆందోళనలో తల్లి దండ్రులు
హాస్టల్లో నిద్రిస్తున్న బాలికలను ఎలుకలు కరిచిన సంఘటన జనగామ జిల్లాలో చోటుచేసుకుంది.
Rats


జనగామ, 25 సెప్టెంబర్ (హి.స.)

హాస్టల్లో నిద్రిస్తున్న బాలికలను ఎలుకలు కరిచిన సంఘటన జనగామ జిల్లాలో చోటుచేసుకుంది. జిల్లాలోని

పాలకుర్తి మండల కేంద్రం నందలి తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో ఎలుకలు విద్యార్థినులను కరవడంతో కలకలం రేగింది.

రాత్రి సమయంలో నిద్రిస్తున్న విద్యార్థినుల్లో 14 మందిని ఎలుకలు కరిచినట్లు సమాచారం. దీంతో వారు అస్వస్థతకు గురయ్యారు. విషయం తెలుసుకున్న పాఠశాల సిబ్బంది వెంటనే బాధిత విద్యార్థినులను చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.

విద్యార్థినులను ఎలుకలు కరవడంతో పాఠశాల విద్యార్థులు, తల్లిదండ్రుల్లో ఆందోళన నెలకొంది.

---------------

హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు


 rajesh pande