భవన అద్దె చెల్లించడం లేదంటూ ఆసుపత్రికి తాళం వేసిన యజమాని
భవన అద్దె చెల్లించకపోవడంతో ఆగ్రహం చెందిన భవన యజమాని ఆసుపత్రి ప్రధాన ద్వారానికి తాళం వేశాడు
Esi


భద్రాద్రి కొత్తగూడెం, 25 సెప్టెంబర్ (హి.స.)

భవన అద్దె చెల్లించకపోవడంతో ఆగ్రహం చెందిన భవన యజమాని ఆసుపత్రి ప్రధాన ద్వారానికి తాళం వేసిన సంఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా లో చోటు చేసుకుంది.

జిల్లాలోని సారపాక ఈఎస్ఐ ఆసుపత్రి వద్ద అద్దె బకాయిల వ్యవహారం శుక్రవారం తీవ్ర దుమారం రేపింది. గత 15 నెలలుగా అద్దె బకాయి చెల్లించడం లేదంటూ భువన యజమాని ఈఎస్ఐ ఆసుపత్రికి తాళం వేశారు.

దీంతో విధులు నిర్వర్తించేందుకు వచ్చిన సిబ్బంది, చికిత్స కోసం వచ్చిన రోగులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు.

భవన యజమాని తెలిపిన వివరాల ప్రకారం, ఈఎస్ఐ ఆసుపత్రికి సంబంధించిన నెలవారీ అద్దె గత 15 నెలలుగా తనకు అందడం లేదని, సంబంధిత అధికారుల దృష్టికి విషయాన్ని పలుమార్లు తీసుకెళ్లినా, విన్నవించినా ఎటువంటి స్పందన లేకపోవడంతో గత్యంతరం లేక ఆసుపత్రికి తాళం వేయాల్సి వచ్చిందని ఆవేదన వ్యక్తం చేశారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..


 rajesh pande