టీటీడీ డిప్యూటీ ఈవో లోకనాథం అరెస్ట్....రూ.5 కోట్ల విలువైన అక్రమాస్తులను గుర్తించిన ఏసీబీ
టీటీడీ డిప్యూటీ ఈవో లోకనాథాన్ని ఏసీబీ అధికారులు అరెస్టు చేశారు.
/ttd-deputy-eo-lokanatham-arrested-582733


తిరుమల, 03 సెప్టెంబర్ (హి.స.)టీటీడీ డిప్యూటీ ఈవో లోకనాథాన్ని ఏసీబీ అధికారులు అరెస్టు చేశారు. నిన్న బుధవారం ఉదయం నుంచి ఆయన నివాసంతో పాటు కార్యాలయాల్లో అధికారులు సుదీర్ఘంగా తనిఖీలు నిర్వహించారు. రూ.5 కోట్ల విలువైన అక్రమాస్తులను గుర్తింపు ఏసీబీ సోదాల్లో లోకనాథంకు సంబంధించి సుమారు రూ.5 కోట్ల విలువైన అక్రమాస్తులను గుర్తించారు. మొత్తం 2 కిలోల బంగారం, 6.5 కిలోల వెండితో పాటు రూ.12 లక్షల నగదును స్వాధీనం చేసుకున్నారు. లోకనాథం, ఆయన కుమారుడి పేరిట ఉన్న 4 ఫిక్స్డ్ డిపాజిట్లను కూడా గుర్తించారు. తిరుపతిలోని శ్రీనివాసనగర్లో ఒక ఫ్లాట్, గొల్లవానిగుంట ప్రాంతంలో రెండు ఇళ్లు, వడమాలపేట మండలం పాదిరేడు గ్రామంలో మరో ఇల్లు కొనుగోలు చేసినట్లు తనిఖీల్లో స్పష్టమైంది.

---------------

హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV


 rajesh pande