మద్యం సేవించి వాహనం నడుపుతూ పట్టుబడ్డ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు డ్రైవర్
ఇబ్రహీంపట్నం రింగ్ సెంటర్లో ట్రాఫిక్ పోలీసులు నిర్వహించిన డ్రంకెన్ డ్రైవ్ తనిఖీల్లో ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు డ్రైవర్ మద్యం సేవించి వాహనం నడుపుతూ పట్టుబడ్డాడు.
Drunk and drive


ఇబ్రహీంపట్నం, 05 సెప్టెంబర్ (హి.స.)

ఇబ్రహీంపట్నం రింగ్ సెంటర్లో ట్రాఫిక్ పోలీసులు నిర్వహించిన డ్రంకెన్ డ్రైవ్ తనిఖీల్లో ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు డ్రైవర్ మద్యం సేవించి వాహనం నడుపుతూ పట్టుబడ్డాడు. విజయవాడ నుంచి జగదల్పూర్కు సుమారు 35 మంది ప్రయాణికులతో వెళ్తున్న గుప్తా ట్రావెల్స్ బస్సును పోలీసులు తనిఖీ చేయగా.. డ్రైవర్ మద్యం సేవించి ఉన్నట్లు గుర్తించారు.

ప్రయాణికులంతా బస్సులో ఉండగానే డ్రైవర్ మద్యం సేవించి వాహనం నడపడం తీవ్ర ఆందోళనకు గురిచేసింది. చిన్న పొరపాటు జరిగినా బస్సులో ఉన్న 35 మంది ప్రాణాలకు ముప్పు వాటిల్లే పరిస్థితి ఉండటంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. డ్రైవర్పై నిబంధనల ప్రకారం చర్యలు తీసుకునేందుకు పోలీసులు సిద్ధమయ్యారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ


 rajesh pande