తిరుమలలో భక్తుల రద్దీ
తిరుమలలో భక్తుల రద్దీ విపరీతంగా పెరిగింది.
తిరుమల


తిరుమల, 05 సెప్టెంబర్ (హి.స.) ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన తిరుమల భక్తులతో కిక్కిరిసిపోయింది. వీకెండ్ కావడంతో దేశం నలుమూలల నుంచి శ్రీవారిని దర్శించుకునేందుకు యాత్రికులు పెద్ద ఎత్తున తరలివచ్చారు.

ప్రస్తుతం వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లోని అన్ని కంపార్ట్మెంట్లు పూర్తిగా నిండిపోయాయి. దీంతో భక్తులు కాలినడక మార్గాలు, బయట ఏర్పాటు చేసిన రింగు రోడ్డు క్యూలైన్లలో గంటల తరబడి వేచివుండాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఎలాంటి ప్రత్యేక టైమ్ స్లాట్ టోకెన్లు లేకుండా సాధారణ సర్వదర్శనానికి వస్తున్న భక్తులకు శ్రీవారి దర్శనం కోసం దాదాపు 20 గంటల సమయం పడుతోంది. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని టీటీడీ అధికారులు క్యూలైన్లలోని వారికి ఎటువంటి అసౌకర్యం కలగకుండా తాగునీరు, పాలు, అల్పాహారం నిరంతరం అందజేస్తున్నారు.

అయితే, శుక్రవారం ఒక్కరోజే శ్రీవారిని 68,374 మంది భక్తులు దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. అదేవిధంగా 35,241 మంది భక్తులు తమ తలనీలాలు సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. శ్రీవారి హుండీ ఆదాయం రూ.4.03 కోట్లు వచ్చినట్లుగా తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు వెల్లడించారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV


 rajesh pande