మార్కాపురంలో పెద్దపులి సంచారం
మార్కాపురం జిల్లా పరిధిలోని అర్ధవీడు మండలం బొల్లుపల్లి సమీపంలోని అల్లూరేణికుంట వద్ద పెద్దపులి సంచారం స్థానికంగా తీవ్ర కలకలం రేపుతోంది.
పెద్దపులి


మార్కాపురం, 05 సెప్టెంబర్ (హి.స.)మార్కాపురం జిల్లా పరిధిలోని అర్ధవీడు మండలం బొల్లుపల్లి సమీపంలోని అల్లూరేణికుంట వద్ద పెద్దపులి సంచారం స్థానికంగా తీవ్ర కలకలం రేపుతోంది.

గత నెల 28న మేతకు వెళ్లిన ఓ గేదెను పెద్దపులి చంపి తినడంతో ఈ విషయం తాజాగా వెలుగులోకి వచ్చింది. గేదె కనిపించకపోవడంతో వెతికిన యజమానికి.. దాని కళేబరం కనిపించడంతో అనుమానం వ్యక్తమైంది. పరిసర ప్రాంతాల్లో పెద్దపులి సంచరిస్తున్నట్లు సమాచారం రావడంతో గ్రామస్థులు.. పశువుల కాపరులు అప్రమత్తమయ్యారు.

అటవీ ప్రాంతానికి సమీపంలో పశువులను మేతకు తీసుకెళ్లే సమయంలో జాగ్రత్తగా ఉండాలని.. ఒంటరిగా అడవివైపు వెళ్లవద్దని అధికారులు సూచిస్తున్నారు. పెద్దపులి సంచారం విషయం ఆలస్యంగా వెలుగులోకి రావడంతో గ్రామాల ప్రజల్లో ఆందోళన మరింత పెరిగింది. అల్లూరేణికుంట పరిసర ప్రాంతాల్లో పులి సంచరించే అవకాశం ఉన్న మార్గాలను గుర్తించి ట్రాప్ కెమెరాలను ఏర్పాటు చేశారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV


 rajesh pande