శ్రీశైలంలో విద్యుదుత్పత్తి తక్షణమే ఆపండి...కేఆర్ఎంబీ.
శ్రీశైలంలో విద్యుదుత్పత్తి తక్షణమే ఆపండి...కేఆర్ఎంబీ.
శ్రీశైలం


శ్రీశైలం, 05 సెప్టెంబర్ (హి.స.) శ్రీశైలం జలాశయం ఎడమ గట్టు విద్యుత్కేంద్రంలో విద్యుదుత్పత్తిని తక్షణమే నిలిపివేయాలని తెలంగాణను కృష్ణా నదీ యాజమాన్య బోర్డు (కేఆర్ఎంబీ) ఆదేశించింది.

తాగునీటి అవసరాల కోసమే కృష్ణా జలాలను వాడుకోవాలని స్పష్టం చేసింది. సాగు, విద్యుత్ అవసరాల్లో సాగునీటికే జలాలు వాడాల్సి ఉంటుందని.. విద్యుత్, తాగునీటి అవసరాల్లో తాగునీటికే అత్యంత ప్రాధాన్యం ఇస్తామని తేల్చిచెప్పింది. రాష్ట్ర విభజన చట్టం మేరకే నీటి కేటాయింపులు ఉంటాయని స్పష్టం చేసింది.

కృష్ణా జల వివాదాల ట్రైబ్యునల్, రాష్ట్ర విభజన చట్టం మేరకు రెండు రాష్ట్రాల నడుమ కృష్ణా జలాలను తాగునీటి అవసరాల కోసం 66:34 నిష్పత్తిలో వాటాలు పంచాలని ఆంధ్రప్రదేశ్ స్పష్టంచేసింది. తెలంగాణ మాత్రం తనకు 70 శాతం వాటా రావాలని.. ఎల్నినో ప్రభావం ఉన్నందున కృష్ణా ప్రాజెక్టుల్లో ఉన్న నీటిని తాగునీటి కోసం చెరిసగం పంచుకునేందుకు తాము అంగీకరిస్తున్నామని తెలిపింది. దీనిని ఏపీ ఈఎన్సీ నరసింహమూర్తి నిర్ద్వంద్వంగా తోసిపుచ్చారు. విభజన చట్టంలో పేర్కొన్న విధంగా 66:34 నిష్పత్తిలో ప్రస్తుతం తమకు రావలసి ఉన్న నాలుగు టీఎంసీలకు అదనంగా 97 టీఎంసీలను కేటాయించాలని బోర్డును కోరారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV


 rajesh pande