ఏపీలో విద్యుత్ చార్జీల పెంపు ప్రతిపాదన
ఏ.పీ, 1 అక్టోబర్ (హి.స.) ఏపీలోని విద్యుత్ వినియోగదారులపై రూ.8,113 కోట్ల ఇంధన సర్దుబాటు ఛార్జీల మోత పడనుంది. యూనిట్కు రూ.4.14 నుంచి రూ.6.19 వరకు భారం పడొచ్చని అంచనా. మూడు డిస్కంలు దాఖలు చేసిన ప్రతిపాదనలపై APERC ఈ నెల 14 వరకు అభ్యంతరాల స్వీకరించనుంది.
ఏపీలో పెరగనున్న కరెంటు చార్జీలు


ఏ.పీ, 1 అక్టోబర్ (హి.స.)

ఏపీలోని విద్యుత్ వినియోగదారులపై రూ.8,113 కోట్ల ఇంధన సర్దుబాటు ఛార్జీల మోత పడనుంది. యూనిట్కు రూ.4.14 నుంచి రూ.6.19 వరకు భారం పడొచ్చని అంచనా. మూడు డిస్కంలు దాఖలు చేసిన ప్రతిపాదనలపై APERC ఈ నెల 14 వరకు అభ్యంతరాల స్వీకరించనుంది. 18న వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రజల అభిప్రాయాలు తెలుసుకోనుంది. 2022-23లో విద్యుత్ కొనుగోళ్లకు చేసిన ఖర్చుకు సంబంధించి ఈ ఛార్జీల వసూలుకు NOVలో ప్రతిపాదనలు సిద్ధమయ్యాయి. అప్పుడు పలు కారణాలతో ఆగిన ప్రక్రియ ఇప్పుడు షురూ అయింది.

వినియోగదారులపై మరో భారాన్ని మోపేందుకు విద్యుత్ పంపిణీ సంస్థలు సిద్ధమయ్యాయి. ఇప్పటికే ట్రూఅప్ ఛార్జీలు, ఇంధన సర్దుబాటు ఛార్జీల పేరుతో డిస్కంలు వినియోగదారుల నడ్డి విరిచాయి. తాజాగా మరో ఇంధన సర్దుబాటు ఛార్జీల పేరుతో భారీగా మోపేందుకు ఆంధ్రప్రదేశ్ విద్యుత్ నియంత్రణ మండలి(ఎపిఇఆర్సి)కి ప్రతిపాదనలు పంపాయి. ఫ్యూయల్ అండ్ పవర్ పర్చేజ్ కాస్ట్ అడ్జస్ట్మెంట్(ఎఫ్పిపిసిఎ) పేరుతో మూడు డిస్కంలు రూ.8113కోట్లు ఇఆర్సికి ప్రతిపాదించాయి.

విద్యుత్ వినియోగదారులపై మూడో సర్దుబాటు ఛార్జీలు వేసేందుకు కూడా డిస్కంలు సిద్ధమయ్యాయి. 2023-24 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి రూ.8957.42 కోట్ల భారం మోపేందుకు ప్రతిపాదనలు రూపొందించినట్లు తెలిసింది. గతేడాది సర్దుబాటు మొత్తం రూ.11,826.42 కోట్లుగా డిస్కంలు తేల్చాయి. వీటిల్లో రూ.2,869 కోట్లు నెల నెలా సర్దుబాటు ఛార్జీలతో డిస్కంలు ఇప్పటికే వసూలు చేశాయి. ఇవి పోనూ ఇంకా రూ.8,957.42 కోట్ల సర్దుబాటు భారం మోపేందుకు సిద్ధంగా ఉన్నాయి.

---------------

హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..


 rajesh pande