హైదరాబాద్, 1 అక్టోబర్ (హి.స.)•కవచ్ 4.0 నూతన వెర్షన్‌ను ఆమోదించి మరియు కోటా నుండి సవాయ్ మాధోపూర్ సెక్షన్ మధ్య 108 కి.మీ పరిధిలో రెండు నెలల వ్యవధిలో అనగా సెప్టెంబర్ 26, 2024న ప్రారంభించిన భారతీయ రైల్వేలు.
•రైల్వే మంత్రిత్వ శాఖ 24 సెప్టెంబర్ 2024న అదే విభాగంలో కవచ్ 4.0కు సంబందించిన 7 పరీక్షలను నిర్వహించింది .
భారతీయ రైల్వే 16 జూన్ 2024న కవచ్ 4.0 నూతన వెర్షన్‌ను ఆమోదించి రెండు నెలల వ్యవధిలో కోట నుండి మరియు సవాయి మాధోపూర్ మధ్య 108 కిమీ పరిధిలో 26 సెప్టెంబర్ 2024 తేదీన ఈ వ్యవస్థకు సంబందించిన అన్నీ పనులను పూర్తి చేసి వాడుకలోకి తీసుకురావడం జరిగినది. రైల్వే మంత్రిత్వ శాఖ అదే విభాగంలో కవచ్ 4.0 కు సంబందించిన 7 రకాల పరీక్షలను నిర్వహించింది. తదనుగుణంగా 10,000 కోమోటివ్‌లలో కవచ్ నూతన వెర్షన్ 4.0 ని ఏర్పాటు చేయడానికి భారతీయ రైల్వే ఇప్పుడు ఆమోదం తెలిపింది. కవచ్ వెర్షన్ 4.0 అనే రక్షణ వ్యవస్థ భారతీయ రైల్వే చరిత్రలో ఒక ప్రధాన మైలురాయి, అప్‌గ్రేడ్ చేసిన వెర్షన్ దేశంలోని విస్తారమైన రైల్వే నెట్‌వర్క్‌లో రైలు కార్యకలాపాల భద్రతను మరింత మెరుగుపరుస్తుంది. ఈ వ్యవస్థ రాబోయే కొన్ని సంవత్సరాలలో మొత్తం రైల్ నెట్ వర్క్ లో ప్రధాన రక్షణ వ్యవస్థ గా ఏర్పడి పూర్తి రక్షణకు సహాయపడుతుంది.
దక్షిణ మధ్య రైల్వేలో నేటి వరకు కవచ్ 1,465 రూట్ కిమీలు మరియు 144 లోకోమోటివ్‌లలో ఏర్పాటుచేయబడింది. ఢిల్లీ-ముంబై మరియు ఢిల్లీ-హౌరా (సుమారు 3,000 రూట్ కిలోమీటర్లు) వంటి అధిక సాంద్రత గల మార్గాలలో కవచ్ విస్తరణ ప్రారంభమైంది. కవచ్ విస్తరణ రెండు దశల్లో చేపట్టబడుతుంది. మొదటి దశలోభాగంగా: కవచ్ రాబోయే నాలుగు సంవత్సరాలలో అన్ని లోకోమోటివ్‌లలో మరియు కొన్ని బ్లాక్ సెక్షన్ లో ఆర్.ఎఫ్.ఐ.డి. సదుపాయం ద్వారా ఏర్పాటు చేయబడుతుంది. రెండవ దశలో భాగంగా: రైల్వే స్టేషన్ మరియు యార్డ్లలో కవచ్ పరికరాలను అమర్చడం ద్వారా పూర్తిగా మన్నికలోకి రావడం జరుగుతోంది.
---------------
హిందూస్తాన్ సమచార్ / నాగరాజ్ రావు