లక్ష్మీ నరసింహ స్వామి రథోత్సవంలో అపశృతి
కర్నూలు, 13 అక్టోబర్ (హి.స.) జిల్లా ఎమ్మిగనూరు మండలం కందనాతిలో లక్ష్మీ నరసింహ స్వామి రథోత్సవంలో అపశృతి చోటుచేసుకుంది. రథోత్సవం జరుగుతుండగా పక్కకు ఒరిగి చుట్టూ వున్న జనంపై రథం పడిపోయింది. ఈ ఘటనలో ఐదుగురికి గాయాలు కాగా.. ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది.
లక్ష్మీ నరసింహ స్వామి రథోత్సవంలో అపశృతి


కర్నూలు, 13 అక్టోబర్ (హి.స.) జిల్లా ఎమ్మిగనూరు మండలం కందనాతిలో లక్ష్మీ నరసింహ స్వామి రథోత్సవంలో అపశృతి చోటుచేసుకుంది. రథోత్సవం జరుగుతుండగా పక్కకు ఒరిగి చుట్టూ వున్న జనంపై రథం పడిపోయింది. ఈ ఘటనలో ఐదుగురికి గాయాలు కాగా.. ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. ఇద్దరిని ఎమ్మిగనూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రతియేటా విజయదశమి తరువాతి రోజు లక్ష్మీ నరసింహస్వామి రథోత్సవం జరుగుతుంది. కింది నుంచి కొండపైకి రథంను మోసుకుపోవడం సంప్రదాయంగా వస్తోంది. కొండపైకి రథాన్ని తీసుకెళ్తుండగా.. పక్కకి ఒరిగి జనంపై రథం పడింది. గాయపడిన వారిని ఆస్పత్రికి తరలించి రథాన్ని కొండపైకి చేర్చారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / నాగరాజ్ రావు


 rajesh pande