అనంతపురం శ్రీసత్యసాయి జిల్లాల్లో కుండపోత. వర్షం
అనంతపురం, 23 అక్టోబర్ (హి.స.): , శ్రీసత్యసాయి జిల్లాల్లో సోమవారం రాత్రి నుంచి మంగళవారం తెల్లవారుజాము వరకు కుండపోత వర్షం కురిసింది. నదులు, కాలువలు పొంగిపొర్లుతుండటంతో రాకపోకలకు అంతరాయం కలిగింది. రాప్తాడు మండలం బండమీదపల్లి చెరువు పొంగిపొర్లడంతోపాటు కనగ
అనంతపురం శ్రీసత్యసాయి జిల్లాల్లో కుండపోత. వర్షం


అనంతపురం, 23 అక్టోబర్ (హి.స.): , శ్రీసత్యసాయి జిల్లాల్లో సోమవారం రాత్రి నుంచి మంగళవారం తెల్లవారుజాము వరకు కుండపోత వర్షం కురిసింది. నదులు, కాలువలు పొంగిపొర్లుతుండటంతో రాకపోకలకు అంతరాయం కలిగింది. రాప్తాడు మండలం బండమీదపల్లి చెరువు పొంగిపొర్లడంతోపాటు కనగానపల్లి చెరువుకు గండిపడటంతో వరద నీరు అనంతపురం జిల్లాకేంద్రాన్ని తాకింది. పండమేరు ఉగ్రరూపం దాల్చి అనంతపురం రూరల్‌ మండలంలోని పలు ప్రాంతాలను ముంచేసింది. అటవీ శాఖ వనమిత్ర వెనుక భాగంలో గుడిసెలు నీట మునిగాయి. పలు కాలనీల్లోని గుడిసెలు, ఆటోలు, ద్విచక్రవాహనాలు కొట్టుకుపోయాయి. భారీగా ఆస్తి నష్టం జరిగింది. కనగానపల్లి మండలంలో రికార్డు స్థాయిలో 198.2 మి.మీ. వర్షపాతం నమోదైంది. అనంతపురం రూరల్‌ మండలం ఉప్పరపల్లి నీట మునిగిన కాలనీలలో చిక్కుకుపోయిన ప్రజలను రెవెన్యూ, పోలీసు, అగ్నిమాపక శాఖ అధికారులు పునరావాస కేంద్రాలకు తరలించారు. రాప్తాడు మండలం బండమీదపల్లి చెరువు నిండి మరువ

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల


 rajesh pande