హైదరాబాద్, 30 అక్టోబర్ (హి.స.)
మంత్రి కొండా సురేఖపై కేటీఆర్ వేసిన పరువునష్టం దావాపై విచారణను నాంపల్లి కోర్టు వచ్చే నెల 13కు వాయిదా వేసింది. నాంపల్లి కోర్టు మెజిస్ట్రేట్ సెలవులో ఉండటంతో ఇన్ఛార్జి జడ్జి పిటిషన్ విచారణను వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు. కాగా నాగచైతన్య-సమంత విడాకులకు కేటీఆరే కారణం అంటూ కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలు తన పరువుకు నష్టం కలిగించాయని కేటీఆర్ ఈ దావా వేశారు. ఇప్పటికే కేటీఆర్ వాంగ్మూలాన్ని కోర్టు నమోదు చేసింది.
నాగార్జున- మంత్రి వివాదం.. నవంబర్ 13కు వాయిదా
మంత్రి కొండా సురేఖపై హీరో నాగార్జున పరువు నష్టం దావా వేసిన విషయం తెలిసిందే. తాజాగా విచారించిన నాంపల్లి స్పెషల్ కోర్టు కేసును మరోసారి వాయిదా వేసింది. మంత్రి కొండా సురేఖపై హీరో నాగార్జున వేసిన పరువు నష్టం దావా కేసు నవంబర్ 13కు వాయిదా వేస్తూ కోర్టు తీర్పునిచ్చింది. మెజిస్ట్రేట్ సెలవులో ఉండడంతో విచారణ నవంబర్ 13కు వాయిదా వేస్తూ ఇన్ఛార్జ్ న్యాయమూర్తి నిర్ణయం తీసుకున్నారు. కొండా సురేఖ తరపున న్యాయవాది గురుమిత్ సింగ్ కోర్టుకు హాజరయ్యారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..