న్యూఢిల్లీ, 13 నవంబర్ (హి.స.)
ఢిల్లీ అంతర్జాతీయ ఎయిర్పోర్ట్ లో అధికారులు కస్టమ్స్ తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో రూ.29.28 కోట్ల విలువ చేసే హెరాయిన్(Heroin) సీజ్ చేశారు. బ్యాంకాక్ నుంచి వచ్చిన ప్రయాణికుడి వద్ద గుర్తించారు. హెరాయిన్ను పాలిథిన్ కవర్లో ప్యాకింగ్ చేసి తరలిస్తుండగా పట్టుకున్నారు. ప్రయాణికుడిని అరెస్ట్ చేసి ఎన్డీపీఎస్ యాక్ట్ (NDPS Act) కింద కేసు నమోదు చేశారు. అయితే ఈ హెరాయినన్ను ఎక్కడికి, ఎవరికి తరలిస్తున్నారనే అంశంపై విచారణ చేపట్టారు. ప్రయాణికుడి నుంచి వివరాలు రాబడుతున్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..