విషన్ .డాక్యుమెంట్స్  పై సి ఏం  చంద్రబాబు  రివ్యూ 
విజయవాడ, 29 నవంబర్ (హి.స.):అక్షర క్రమంలోనే కాదు.. అభివృద్ధిలో సైతం దేశంలోనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అగ్రపథాన నిలిపేందుకు చంద్రబాబు సారథ్యంలోని కూటమి ప్రభుత్వం వ్యూహాత్మకంగా అడుగులు వేస్తుంది. అందులోభాగంగా స్వర్ణాంధ్ర విజన్ 2047కు సంబంధించిన విజన్ డ
   విషన్ .డాక్యుమెంట్స్  పై సి ఏం  చంద్రబాబు  రివ్యూ 


విజయవాడ, 29 నవంబర్ (హి.స.):అక్షర క్రమంలోనే కాదు.. అభివృద్ధిలో సైతం దేశంలోనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అగ్రపథాన నిలిపేందుకు చంద్రబాబు సారథ్యంలోని కూటమి ప్రభుత్వం వ్యూహాత్మకంగా అడుగులు వేస్తుంది. అందులోభాగంగా స్వర్ణాంధ్ర విజన్ 2047కు సంబంధించిన విజన్ డాక్యుమెంట్‌ ఆవిష్కరణకు చర్యలు చేపట్టింది. ఆ క్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన శుక్రవారం అమరావతిలో ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. ఈ విజన్ డాక్యుమెంట్‌రూపకల్పనపై ఈ సందర్భంగా కీలక అంశాలను చర్చించారు.

గత అసెంబ్లీ సమావేశాల్లో స్వర్ణాంధ్ర విజన్-2047 డ్రాఫ్ట్ డాక్యుమెంట్‌ను శాసనసభ ద్వారా ప్రభుత్వం ప్రజల ముందు ప్రభుత్వం ఉంచిన సంగతి తెలిసిందే. నీతి ఆయోగ్‌తో పాటు పలు ప్రతిష్టాత్మక సంస్థల భాగస్వామ్యంతో ఈ విజన్ డాక్యుమెంట్‌ను ప్రభుత్వం రూపొందిస్తోంది. ఇప్పటికే వివిధ ఏజెన్సీలు, పలువురు నిపుణులు, మేధావులతోపాటు 17 లక్షల మంది నుంచి విజన్ డాక్యుమెంట్‌పై సూచనలు, సలహాలను ఈ ప్రభుత్వం తీసుకుంది. అందరి అభిప్రాయాలు, ఆలోచనలను పరిశీలించిన ప్రభుత్వం వాటిని పరిగణలోకి తీసుకుంది.

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల


 rajesh pande