
హైదరాబాద్, 18 జనవరి (హి.స.)
దేశ అభివృద్ధిలో బీహారీల పాత్ర
అత్యంత కీలకమని మల్కాజిగిరి పార్లమెంటు సభ్యుడు ఈటల రాజేందర్ హాట్ కామెంట్స్ చేశారు. ఆదివారం టీ హబ్లో నిర్వహించిన బీహార్ డెవలప్మెంట్ సమ్మిట్-2026 కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఆయన, ప్రధాని నరేంద్ర మోడీ నాయకత్వంలో భారత్ ప్రపంచానికి అన్నం పెట్టే స్థాయికి చేరుకుందని పేర్కొన్నారు.
'వికసిత్ భారత్ కావాలంటే వికసిత్ బీహార్ కూడా కావాలి' అని మోడీ చెప్పిన మాటలను ఆయన గుర్తు చేశారు.
దేశంలో వ్యవసాయం, డైరీ, పౌల్ట్రీ, మౌలిక సదుపాయాలు వంటి అనేక రంగాల్లో బీహారీల కృషి కన్పిస్తుందని ఈటల తెలిపారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ రావు