
వికారాబాద్, 18 జనవరి (హి.స.) వికారాబాద్ జిల్లా తాండూర్ పట్టణం మాణిక్ నగర్
లో ఆదివారం మధ్యాహ్నం సమయంలో మర్డర్ సంఘటన జరిగింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం... ఇంటి స్థలం కోసం గత కొన్ని రోజులుగా పట్టణానికి చెందిన మోసిన్, రెహమాన్ ఇద్దరు అన్నదమ్ముల మధ్య తరచూ గొడవలు జరుగుతుండేవి. ఇంటి స్థలం దక్కించుకునేందుకు సొంత తమ్ముడు రెహమాన్ అడొస్తున్నాడని కోపంతో కత్తితో విచక్షణ రహితంగా దాడి చేసి హతమర్చాడు అన్న మోసిన్. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
---------------
హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ రావు