
అమరావతి, 18 జనవరి (హి.స.)ఏపీ సమాచార కమిషన్‌కు చీఫ్ కమిషనర్ సహా నలుగురు కమిషనర్లను నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి విజయానంద్ ఉత్తర్వులు జారీ చేశారు. చీఫ్ కమిషనర్‌గా వజ్జా శ్రీనివాసరావు నియమితులయ్యారు. కమిషనర్లుగా వి.శరత్‌చంద్ర కల్యాణ చక్రవర్తి, గాజుల ఆదెన్న, ఒంటేరు రవిబాబు, పరవాడ సింహాచలం నాయుడును ప్రభుత్వం నియమించింది. మూడేళ్ల సర్వీస్ లేదా 65 ఏళ్లు వచ్చే వరకు ఆర్టీఐ కమిషనర్లుగా పదవిలో కొనసాగుతారని ప్రభుత్వం ఉత్తర్వుల్లో పేర్కొంది.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ