గుంటూరు, 29 నవంబర్ (హి.స.)చిలకలూరిపేట నియోజకవర్గ సోషల్ మీడియా యాక్టివిస్టులు పెద్దిరెడ్డి సుధారాణి దంపతులకు గుంటూరు కోర్టు బెయిల్ మంజూరు చేసింది. సోషల్ మీడియాలో సుధారాణి దంపతులు పోస్ట్ పెట్టారంటూ నగరంపాలెం పోలీసులు కేసు నమోదు చేశారు. నరసరావుపేట సబ్ జైల్లో ఉన్న సుధారాణి దంపతులను పిటి వారెంట్ ద్వారా గుంటూరు కోర్టులో పోలీసులు ప్రవేశపెట్టగా, సుధారాణి దంపతులకు బెయిల్ మంజూరైంది.
వైజాగ్ సోషల్ మీడియా యాక్టివిస్టు బోడి వెంకటేశ్వర్లుకు కూడా గుంటూరు కోర్టు బెయిల్ మంజూరు చేసింది. సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టాడంటూ పట్టాభిపురం పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. ఒంగోలు జైలు నుంచి పిటి వారెంట్ ద్వారా గుంటూరు కోర్టులో ప్రవేశపెట్టగా, ఆయనుకు గుంటూరు కోర్టు బెయిల్ మంజూరు చేసింది.
---------------
హిందూస్తాన్ సమచార్ / నాగరాజ్ రావు