రాయదుర్గం లో. తెదేపా కార్యకర్త.దారుణ హత్య
10 జూలై (హి.స.) రాయదుర్గం గ్రామీణం, పట్టణం, పాత కక్షలతో తెదేపా కార్యకర్తను దారుణంగా హత్య చేసిన ఉదంతమిది. ఆంధ్రా, కర్ణాటక సరిహద్దుల్లో.. అనంతపురం జిల్లా రాయదుర్గం మండలం మెచ్చిరి గ్రామానికి చెందిన ఆదెప్ప (50)ను ప్రత్యర్థులు కత్తితో విచక్షణా రహితంగా నర
రాయదుర్గం లో. తెదేపా కార్యకర్త.దారుణ హత్య


10 జూలై (హి.స.)

రాయదుర్గం గ్రామీణం, పట్టణం, పాత కక్షలతో తెదేపా కార్యకర్తను దారుణంగా హత్య చేసిన ఉదంతమిది. ఆంధ్రా, కర్ణాటక సరిహద్దుల్లో.. అనంతపురం జిల్లా రాయదుర్గం మండలం మెచ్చిరి గ్రామానికి చెందిన ఆదెప్ప (50)ను ప్రత్యర్థులు కత్తితో విచక్షణా రహితంగా నరికి గ్రామ శివారులో పడేశారు. ఏడాదిన్నర కిందట గ్రామంలో రెండు సామాజిక వర్గాల మధ్య విభేదాలు తలెత్తాయి. ఓ వర్గం గ్రామంలో లేని సమయంలో మరో సామాజిక వర్గం వారు ప్రత్యర్థుల ఇళ్లలోకి దూరి మహిళలపై విచక్షణా రహితంగా దాడిచేసి తీవ్రంగా గాయపరిచారు. నాడు అధికార వైకాపా నాయకులు బాధితులైన 16 మంది తెదేపా వర్గీయులపైనే కేసు నమోదు చేయించారు. దీంతో గ్రామంలో యాదవ సామాజిక వర్గానికి చెందిన 16 మందిని రిమాండ్‌కు తరలించారు. 10 మంది వైకాపా వర్గీయులపై ఫిర్యాదు చేసినా కేసు నమోదులో పోలీసులు వివక్ష చూపినట్లు అప్పట్లో గ్రామస్థులు ఆరోపించారు. చివరకు, వైకాపా మద్దతుదారులపై తక్కువ తీవ్రత గల సెక్షన్‌లతో కేసు పెట్టారు. అప్పటి నుంచి గ్రామంలో కక్షలు పెరగ్గా, ఎన్నికలు ముగిసే వరకు పోలీసుల పికెట్‌ కొనసాగింది. ఎన్నికలు ప్రశాంతంగా ముగిసినప్పటికీ, తర్వాత రెండు నెలల్లోపే ఈ దారుణం జరగడంతో గ్రామస్థులు ఉలిక్కిపడ్డారు.

ముగింపు

హిందూస్తాన్ సమచార్ / నిత్తల / నాగరాజ్ రావు


 rajesh pande