తెలంగాణ పర్యాటక రంగ అభివృద్ధి కోసం 2000 కోట్లతో పనులు.. టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ పటేల్ రమేష్ రెడ్డి
Telangana, సూర్యాపేట.10 జూలై (హి.స.) తెలంగాణలో పర్యాటక రంగం అభివృద్ధి కోసం సుమారు రూ.2 వేల కోట్లతో నిర్మాణపు పనులు చేపట్టనున్నట్లు తెలంగాణ టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ పటేల్ రమేష్ రెడ్డి స్పష్టం చేశారు. టూరిజం చైర్మన్ గా పదవీ బాధ్యతలు చేపట్
టూరిజం డెవలప్మెంట్ చైర్మన్


Telangana, సూర్యాపేట.10 జూలై (హి.స.)

తెలంగాణలో పర్యాటక రంగం అభివృద్ధి కోసం సుమారు రూ.2 వేల కోట్లతో నిర్మాణపు పనులు చేపట్టనున్నట్లు తెలంగాణ టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ పటేల్ రమేష్ రెడ్డి

స్పష్టం చేశారు. టూరిజం చైర్మన్ గా పదవీ బాధ్యతలు చేపట్టి రాష్ట్ర రాజదాని నుంచి తొలిసారిగా సూర్యాపేట కు వచ్చిన సందర్భంగా బుధవారం పార్టీ నాయకులు,

కార్యకర్తలు, అభిమానులు జిల్లా కేంద్రంలోని ఎన్టీఆర్ పార్క్ వద్ద ఘన స్వాగతం పలికారు. అనంతరం అక్కడి నుంచి పటేల్ నివాసం వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన నివాసంలో

ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో పటేల్ మాట్లాడుతూ.. సీఎం రేవంత్ రెడ్డి తనకు అప్పగించిన ఈ బాధ్యతను సమర్ధవంతంగా నిర్వహిస్తూ

తెలంగాణను పర్యాటకంలో దేశంలోనే ఆదర్శంగా నిలిపేందుకు కృషి చేస్తానని వెల్లడించారు.

హిందూస్తాన్ సమచార్ / Bachu Ranjith Kumar / నాగరాజ్ రావు


 rajesh pande