సరిపడినంత యూరియా అందుబాటులో ఉంది : కలెక్టర్ అనుదీప్
ఖమ్మం, 02 జనవరి (హి.స.) జిల్లా అవసరాలకు సరిపడినంత యూరియాని ఏరియా అందుబాటులో ఉందని జిల్లా కలెక్టర్ అనుదీప్ దూరిశెట్టి రైతులకు సూచించారు. మండల కేంద్రం కొణిజర్లలో యూరియా పంపిణీ కేంద్రాన్ని సీపీ సునీల్ దత్ తో కలిసి శుక్రవారం పరిశీలించారు. ఈ సందర్భంగ
ఖమ్మం కలెక్టర్


ఖమ్మం, 02 జనవరి (హి.స.)

జిల్లా అవసరాలకు సరిపడినంత

యూరియాని ఏరియా అందుబాటులో ఉందని జిల్లా కలెక్టర్ అనుదీప్ దూరిశెట్టి రైతులకు సూచించారు. మండల కేంద్రం కొణిజర్లలో యూరియా పంపిణీ కేంద్రాన్ని సీపీ సునీల్ దత్ తో కలిసి శుక్రవారం పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. రైతులకు అవసరమైన మేరకే వాడాలని విజ్ఞప్తి చేశారు. రబీ అవసరాలకు సరిపడినంత యూరియా నిల్వలు అందుబాటులో ఉన్నాయని అవసరమైతే తెప్పించి పంపిణీ చేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని రైతులు అధైర్య పడాల్సిన అవసరం లేదన్నారు. కూపన్లు పంపిణీ పారదర్శకంగా జరగాలని పంచాయతీ కార్యదర్శులు జీపిఓలు వ్యవసాయ అధికారులకు సహకరించాలని సూచించారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు


 rajesh pande