
భద్రాద్రి కొత్తగూడెం, 02 జనవరి (హి.స.) రౌడీయిజం చేస్తే ఎట్టి పరిస్థితుల్లో
ఉపేక్షించేది లేదని మణుగూరు డీఎస్పీ రవీందర్ రెడ్డి అన్నారు. శుక్రవారం వారు స్థానిక పోలీస్ స్టేషన్లో మాట్లాడుతూ.. శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తూ, ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తే కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు. రౌడీయిజం పై ఉక్కుపాదం మోపడమే లక్ష్యమన్నారు. ముఖ్యంగా నేరాలకు దారి తీసే పరిస్థితులను ముందే అరికట్టాలనే లక్ష్యంతోనే ఈ చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు. మహిళలపై నేరాలకు పాల్పడే వారి కార్యకలాపాలను పూర్తిగా అణచివేసేందుకు ప్రత్యేక చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు. ఈ చర్య ద్వారా చట్టాన్ని ఉల్లంఘించాలనే ఆలోచన ఉన్న కూడా గట్టి గుణపాఠం చెప్పినట్లవుతుందన్నారు.
హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు