
షాద్నగర్, 02 జనవరి (హి.స.)
తెలంగాణ రాష్ట్ర సాధనలో
అమరవీరుల త్యాగాలు మరువ లేనివని రాష్ట్ర ప్రభుత్వ రంగ సంస్థల చైర్మన్, షాద్ నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ అన్నారు. స్థానిక ఎంపీడీవో కార్యాలయం ఆవరణలో శుక్రవారం అమరవీరుల స్థూపానికి ఎమ్మెల్యే శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర సాధనలో ఎంతోమంది అమరులయ్యారని, వారి త్యాగాలు వెలకట్టలేనివని అన్నారు. వారి త్యాగాలు భవిష్యత్ తరాలకు అందించేందుకు అమరవీరుల స్తూపాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు ఎమ్మెల్యే తెలిపారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు