అమరావతిలో.లాండ్ పూలింగ్ ఆరంభం
, అమరావతి: 26 జూలై (హిం.స) ఎన్డీయే ప్రభుత్వం కొలువుదీరడం, అమరావతి పునర్నిర్మాణానికి ముఖ్యమంత్రి చంద్రబాబు అగ్రప్రాధాన్యం ఇస్తుండడంతో సమీకరణ విధానంలో భూములు ఇచ్చేందుకు పలువురు రైతులు ఆసక్తి చూపిస్తున్నారు. పెనుమాకలో రాజధాని, సీడ్‌ యాక్సెస్‌ రోడ్డు ని
అమరావతిలో.లాండ్ పూలింగ్ ఆరంభం


, అమరావతి: 26 జూలై (హిం.స) ఎన్డీయే ప్రభుత్వం కొలువుదీరడం, అమరావతి పునర్నిర్మాణానికి ముఖ్యమంత్రి చంద్రబాబు అగ్రప్రాధాన్యం ఇస్తుండడంతో సమీకరణ విధానంలో భూములు ఇచ్చేందుకు పలువురు రైతులు ఆసక్తి చూపిస్తున్నారు. పెనుమాకలో రాజధాని, సీడ్‌ యాక్సెస్‌ రోడ్డు నిర్మాణానికి రెండు రోజుల్లో రైతులు 2.65 ఎకరాలను ఇచ్చారు. తాజాగా కేంద్ర బడ్జెట్‌లోనూ అమరావతి నిర్మాణానికి తోడ్పాటు అందించనున్నట్లు మోదీ ప్రభుత్వం ప్రకటించింది. ఈ నేపథ్యంలో పూలింగ్‌లో భూములిచ్చేందుకు ముందుకొచ్చే వారి నుంచి తీసుకోవాలని సీఆర్డీఏ కమిషనర్‌ కాటమనేని భాస్కర్‌.. రాజధానిలో భూ వ్యవహారాలు పర్యవేక్షిస్తున్న డిప్యూటీ కలెక్టర్లకు ఆదేశాలిచ్చారు. వైకాపా ప్రభుత్వ హయాంలో ఈ ప్రక్రియను నిలిపివేయడంతో పాటు గత తెదేపా ప్రభుత్వం ఇచ్చిన భూసేకరణ ప్రకటనను కూడా ఉపసంహరించుకున్న సంగతి తెలిసిందే. రాజధాని నిర్మాణానికి తెదేపా ప్రభుత్వం 25,398 మంది రైతుల నుంచి 34,281 ఎకరాలను సమీకరణ విధానంలో తీసుకుంది. మరో 4 వేల ఎకరాలను సమీకరించాల్సి ఉండగా, రైతులు ముందుకు రాకపోవడంతో అప్పట్లో ఆ ప్రక్రియ ఆగిపోయింది.,

హిందూస్తాన్ సమచార్

హిందూస్తాన్ సమచార్ / నిత్తల / నాగరాజ్ రావు


 rajesh pande