అమరావతి: 31 జూలై (హి.స.)నిత్యావసరాల ధరలు ఆకాశాన్ని తాకి సామాన్యులు విలవిల్లాడుతున్న వేళ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ముఖ్యమైన నిర్ణయం తీసుకుంది. నిత్యావసరాలైన బియ్యం, కందిపప్పు, స్టీమ్డ్ బియ్యం ధరలను మరో దఫా తగ్గించాలని నిర్ణయించింది. ఈ మేరకు పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ కీలక ప్రకటన చేశారు. బహిరంగ మార్కెట్‌లో కందిపప్పు కిలో ధర రూ.160గా ఉండగా దానిని రూ.150కి తగ్గిస్తున్నామని ప్రకటించారు. ఇక బియ్యం ధరను రూ.48 నుంచి రూ.47కి స్వల్పంగా తగ్గిస్తు్న్నట్టు వెల్లడించారు. ఈ మేరకు ఎక్స్ వేదికగా బుధవారం స్పందించారు.
హిందూస్తాన్ సమచార్
హిందూస్తాన్ సమచార్ / నిత్తల / నాగరాజ్ రావు