అమరావతి 1 ఆగస్టు (హి.స.)
విజయనగరం రూరల్: కోరుకొండ, జామి, ఎస్.కోట ప్రాంతాల్లో ఎన్టీఆర్ భరోసా పింఛన్లను కలెక్టర్ డాక్టర్ బి.ఆర్ అంబేడ్కర్ పంపిణీ చేశారు. సచివాలయ, ఇతర శాఖల ఉద్యోగులు ఇంటింటికి వెళ్లి పెన్షన్లను పంపిణీ చేశారు. ప్రభుత్వం మంచి లక్ష్యంతో పెన్షన్లు పంపిణీ చేస్తుందని కలెక్టర్ అంబేడ్కర్ చెప్పారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఉద్యోగులకు ఆయన సూచనలు చేశారు. ఇంటింటికి తిరిగి ప్రభుత్వ సంక్షేమ పథకాలను అందించే బాధ్యత ఉద్యోగులు తీసుకోవాలని కోరారు. ఎంపీడీవోలు మున్సిపల్ కమిషనర్లు నిరంతరం పర్యవేక్షించాలన్నారు. కలెక్టర్ వెంట డీపీవో శ్రీధర్ రాజా ఎంపీడీవోలు ఉన్నారు.
హిందూస్తాన్ సమచార్
హిందూస్తాన్ సమచార్ / నిత్తల / నాగరాజ్ రావు