రేవంత్ రెడ్డి చీఫ్ మినిస్టర్ కాదు.. చీప్ మినిస్టర్.. హరీష్ రావు ఎద్దేవా
హైదరాబాద్, 1 ఆగస్టు (హి.స.) రేవంత్ రెడ్డి చీఫ్ మినిస్టర్ గా కాకుండా చిల్లరగా మాట్లాడి చీప్ మినిస్టర్ వ్యవహరిస్తున్నారంటూ బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్ రావు ధ్వజమెత్తారు. నాకు మంత్రి పదవి ఎవరి భిక్ష వల్లనో రాలేదని.. సోనియా గాంధీ కోరిక మేరకు ఆ నాడు కాంగ్ర
హరీష్ రావు ఎద్దేవా


హైదరాబాద్, 1 ఆగస్టు (హి.స.)

రేవంత్ రెడ్డి చీఫ్ మినిస్టర్ గా కాకుండా చిల్లరగా మాట్లాడి చీప్ మినిస్టర్ వ్యవహరిస్తున్నారంటూ బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్ రావు ధ్వజమెత్తారు. నాకు మంత్రి పదవి ఎవరి భిక్ష వల్లనో రాలేదని.. సోనియా గాంధీ కోరిక మేరకు ఆ నాడు కాంగ్రెస్ ప్రభుత్వంలో చేరామే తప్ప పదవుల కోసం కాదన్నారు. కనీసం వార్డు మెంబర్ గా కూడా లేని సమయంలో హరీశ్ రావును రాష్ట్ర మంత్రిగా చేసింది కాంగ్రెస్ పార్టీ అని అసెంబ్లీలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలకు హరీశ్ రావు గురువారం ట్విట్టర్ వేదికగ కౌంటర్ ఇచ్చారు. నాకు మంత్రి పదవి వచ్చినప్పుడు రేవంత్ రెడ్డి బీఆర్ఎస్ లోనే ఉన్నావు.. ఆ ఊరేగింపులోనూ ఉన్నావు. తెలంగాణకు జరుగుతున్న అన్యాయాన్ని ప్రశ్నిస్తూ మంత్రి పదవికి రాజీనామా చేసినప్పుడూ కూడా నా వెనకే ఉన్నావ్. నిక్కి నిక్కి చూశావ్. ఇదంతా నీ కళ్ల ముందు జరిగిందే. కానీ ఇవేవి తెలియనట్లు చిల్లర వ్యాఖ్యలు చేస్తున్నావ్. పదవులు, విలువల గురించి మాట్లాడే హక్కు నీకెక్కడిది రేవంత్ రెడ్డి అని ఫైర్ అయ్యారు. తెలంగాణ ఉద్యమంలో పదవులను గడ్డిపోచలుగా త్యజించిన చరిత్ర మాదైతే పూటకో పార్టీ మారిన రాజకీయ చరిత్ర నీది. పదవుల కోసం పెదవులు మూసుకున్న చరిత్ర నీది అంటూ ధ్వజమెత్తారు. ముఖ్యమంత్రి హోదాలో ఉంటూ హుందాగా ప్రవర్తించడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.

హిందూస్తాన్ సమచార్

హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ కుమార్ / నాగరాజ్ రావు


 rajesh pande