రాహుల్‌కు అదో అలవాటుగా మారింది: అమిత్‌ షా మండిపాటు
దిల్లీ:, 11 సెప్టెంబర్ (హి.స.) అమెరికా(USA) పర్యటనలో భాగంగా కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ (Rahul Gandhi) చేసిన వ్యాఖ్యలపై భాజపా నుంచి తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. తాజాగా కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా(Amit shah) ఆయనపై మండిపడ్డారు. దేశాన్ని విభజించేందు
ోamit shah


దిల్లీ:, 11 సెప్టెంబర్ (హి.స.) అమెరికా(USA) పర్యటనలో భాగంగా కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ (Rahul Gandhi) చేసిన వ్యాఖ్యలపై భాజపా నుంచి తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. తాజాగా కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా(Amit shah) ఆయనపై మండిపడ్డారు. దేశాన్ని విభజించేందుకు కుట్ర పన్నుతోన్న శక్తులకు అండగా నిలబడటం రాహుల్‌కు, కాంగ్రెస్ పార్టీకి అలవాటుగా మారిందని ఆగ్రహం వ్యక్తంచేశారు.

‘‘దేశ వ్యతిరేక ప్రకటనలు చేయడం, దేశాన్ని విచ్ఛిన్నం చేసే శక్తులకు అండగా నిలవడం రాహుల్, కాంగ్రెస్‌కు అలవాటుగా మారింది. జమ్మూకశ్మీర్‌లో నేషనల్ కాన్ఫరెన్స్‌కు చెందిన దేశవ్యతిరేక, రిజర్వేషన్ల వ్యతిరేక అజెండాకు మద్దతు ఇవ్వడమైనా సరే, విదేశీ గడ్డపై భారత్‌ వ్యతిరేక ప్రకటనలైనా సరే.. ఆయన ప్రతిసారీ దేశ భద్రతను ముప్పులో పడేస్తున్నారు. మనోభావాలను దెబ్బతీస్తున్నారు. ప్రాంతీయవాదం, మతం, భాష పరంగా చీలికలు తెచ్చే కాంగ్రెస్ రాజకీయాలను రాహుల్‌ ప్రకటన బయటపెట్టింది

---------------

హిందూస్తాన్ సమచార్ / నాగరాజ్ రావు


 rajesh pande