ముంబయి:, 11 సెప్టెంబర్ (హి.స.) దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు బుధవారం ఫ్లాట్‌గా ప్రారంభమయ్యాయి. అంతర్జాతీయ మార్కెట్లలోని ప్రతికూల సంకేతాల నడుమ మన మార్కెట్లు అప్రమత్తత పాటిస్తున్నాయి. మొదట ఫ్లాట్‌గా మొదలైన సూచీలు ఆ తర్వాత నష్టాల్లోకి జారుకున్నాయి. ఉదయం 9:27 గంటల సమయంలో సెన్సెక్స్ 156 పాయింట్లు నష్టపోయి 81,766 వద్ద కొనసాగుతోంది. నిఫ్టీ 48 పాయింట్లు కుంగి 24,995 వద్ద ట్రేడవుతోంది. డాలరుతో పోలిస్తే రూపాయి మారకం విలువ రూ.83.96 వద్ద ప్రారంభమైంది.
సెన్సెక్స్ 30 (Sensex) సూచీలో టాటా మోటార్స్, ఓఎన్‌జీసీ, హీరో మోటార్‌కార్ప్, హిందాల్కో, హెచ్‌డీఎఫ్‌సీ లైఫ్, ఇండస్‌ఇండ్ బ్యాంక్, విప్రో, మారుతీ సుజుకీ, జేఎస్‌డబ్ల్యూ స్టీల్, యాక్సిస్ బ్యాంక్, ఎంఅండ్‌ఎం షేర్లు నష్టాల్లో ఉండగా.. ఏషియన్ పెయింట్స్, బీపీసీఎల్, నెస్లే, ఐటీసీ, హెచ్‌యూఎల్, హెచ్‌సీఎల్ టెక్, ఇన్ఫీ షేర్లు లాభాల్లో కొనసాగుతున్నాయి
---------------
హిందూస్తాన్ సమచార్ / నాగరాజ్ రావు