
న్యూఢిల్లీ, 19 డిసెంబర్ (హి.స.)
రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసు లో ఇవాళ సుప్రీంకోర్టులో విచారణ కొనసాగింది. ధర్మాసనం ఆదేశాల మేరకు డిసెంబర్ 12న కేసులో ప్రధాన నిందితుడు మాజీ ఎస్ఐబీ చీఫ్ ప్రభాకర్రావు లొంగిపోయిన విషయం తెలిసిందే. ఈ మేరకు జస్టిస్ బీవీ నాగరత్న ధర్మాసనానికి సిట్ తరఫు న్యాయవాది ప్రభాకర్రావుకు సంబంధించి వారం రోజుల కస్టోడియల్ రిపోర్టును అందజేశారు. అయితే, రిపోర్టులో చివరగా నిందితుడు విచారణకు ఏమాత్రం సహకరించడం లేదని, మరోసారి కస్టోడియల్ విచారణ అవసరం ఉందని పేర్కొన్నారు. ఇరు పక్షాల వాదనలు విన్న సుప్రీం ధర్మాసనం ఈనెల 25 వరకు ప్రభాకర్రావు కస్టోడియల్ విచారణను పొడిగిస్తున్నట్లుగా ప్రకటించింది.
---------------
హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..