
న్యూఢిల్లీ, 19 డిసెంబర్ (హి.స.)
క్రిస్మస్, న్యూ ఇయర్ సెలవుల నేపథ్యంలో సుప్రీంకోర్టు లో అత్యవసర కేసుల విచారణపై సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ కీలక ప్రకటన చేశారు. ఎమర్జెన్సీ కేసుల విచారణకు డిసెంబర్ 22న ఒకటి లేదా రెండు బెంచ్లను అదనంగా అందుబాటులో ఉంచనున్నట్లు తెలిపారు. తాను కూడా ఆ రోజున అందుబాటులో ఉంటానని, ఇతర న్యాయమూర్తులపై అదనపు భారం పడకుండా చూస్తానని అన్నారు.
కాగా, ఈ నెల 22 నుంచి జనవరి 2, 2026 వరకు సుప్రీంకోర్టు వింటర్ వెకేషన్ కొనసాగనుంది. ఈ క్రమంలోనే కోర్టు సాధారణ విచారణలు జరపకపోయినా బెయిల్, చైల్డ్ కస్టడీ, అరెస్ట్ నుంచి రక్షణ, హేబియస్ కార్పస్ వంటి అత్యవసర పిటిషన్లను సుప్రీంకోర్టు రిజిస్ట్రీ పరిశీలించి, నిజంగా ఎమర్జెన్సీ ఉంటే డిసెంబర్ 22న లిస్ట్ చేయనుంది.
హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ రావు