ఢిల్లీకి రెడ్ అలర్ట్... 150 విమానాలు రద్దు
న్యూఢిల్లీ, 19 డిసెంబర్ (హి.స.) తీవ్రమైన పొగమంచు నేపథ్యంలో భారత వాతావరణ శాఖ దేశ రాజధాని నగరం ఢిల్లీకి రెడ్ అలర్ట్ జారీ చేసింది. శుక్రవారం ఉదయం ఢిల్లీలో 100 మీటర్ల దూరం కూడా కనిపించనంతగా దట్టమైన పొగమంచు అలుముకుంది. రోడ్డు, రైలు, విమాన రాకపోకలకు త
ఢిల్లీ రెడ్ అలర్ట్


న్యూఢిల్లీ, 19 డిసెంబర్ (హి.స.)

తీవ్రమైన పొగమంచు నేపథ్యంలో

భారత వాతావరణ శాఖ దేశ రాజధాని నగరం ఢిల్లీకి రెడ్ అలర్ట్ జారీ చేసింది. శుక్రవారం ఉదయం ఢిల్లీలో 100 మీటర్ల దూరం కూడా కనిపించనంతగా దట్టమైన పొగమంచు అలుముకుంది. రోడ్డు, రైలు, విమాన రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడుతుందని వాతావరణ శాఖ హెచ్చరికలు చేసింది. దీంతో ఢిల్లీ నుంచి బయల్దేరాల్సిన 150కి పైగా విమానాలు రద్దయ్యాయి, మరో 200 విమానాలు ఆలస్యంగా బయలుదేరుతున్నాయి.

అలాగే ఉత్తర భారత్ లోని పంజాబ్, హరియాణా, దిల్లీ, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, బిహార్ రాష్ట్రాలను కూడా పొగమంచు కమ్మేసిందని IMD పేర్కొంది. శుక్రవారం తెల్లవారుజామున ఆగ్రా, బరేలీ, అమృత్సర్, అంబాలా, సఫ్టరింగ్ వంటి ప్రాంతాల్లో విజిబిలిటీ జీరోకి పడిపోయింది.

హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ రావు


 rajesh pande