
న్యూఢిల్లీ, 19 డిసెంబర్ (హి.స.)
బంగ్లాదేశ్లో రేగిన తీవ్ర అల్లర్ల నేపథ్యంలో అక్కడి పరిస్థితి అంతకంతకు దిగజారుతోంది. ఈ నేపథ్యంలో బంగ్లా లోని ఇండియన్స్ కు భారత హైకమిషన్ హెచ్చరికలు జారీ చేసింది. అత్యవసరం అయితే తప్ప ఎవరూ బయటికి రావొద్దని అడ్వైజరీ విడుదల చేసింది. కాగా బంగ్లాదేశ్లో విద్యార్థి నాయకుడు షరీఫ్ ఉస్మాన్ బిన్ హైది మరణంతో అక్కడ మరోసారి తీవ్ర అల్లర్లు చెలరేగాయి. గురువారం రాత్రి నుంచి భారత్, అవామీలీగకు వ్యతిరేకంగా ఆందోళనకారులు వీధుల్లోకి రావడంతో నిరసనలు తీవ్రరూపం దాల్చాయి.
ఈ నేపథ్యంలో బంగ్లాదేశ్లోని భారత హైకమిషన్.. అక్కడ నివసిస్తున్న భారతీయులు, విద్యార్థులు అనవసర ప్రయాణాలు చేయవద్దని, అత్యవసరమైతే తప్ప బయటకు రావొద్దని హెచ్చరించింది.
హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..