టిటిడి కి తొలిసారి. గా శ్రీకాకుళం.జిల్లా పలాస జీడిపప్పు పంపిణీ
విజయవాడ, 27 సెప్టెంబర్ (హి.స.) కాశీబుగ్గ, : తిరుమల తిరుపతి దేవస్థానానికి తొలిసారిగా శ్రీకాకుళం జిల్లా పలాస జీడిపప్పును గురువారం పంపించారు. కేంద్రమంత్రి రామ్మోహన్‌నాయుడు, రాష్ట్ర మంత్రి అచ్చెన్నాయుడు, ఎమ్మెల్యే గౌతు శిరీష ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
టిటిడి కి తొలిసారి. గా శ్రీకాకుళం.జిల్లా పలాస జీడిపప్పు పంపిణీ


విజయవాడ, 27 సెప్టెంబర్ (హి.స.)

కాశీబుగ్గ, : తిరుమల తిరుపతి దేవస్థానానికి తొలిసారిగా శ్రీకాకుళం జిల్లా పలాస జీడిపప్పును గురువారం పంపించారు. కేంద్రమంత్రి రామ్మోహన్‌నాయుడు, రాష్ట్ర మంత్రి అచ్చెన్నాయుడు, ఎమ్మెల్యే గౌతు శిరీష ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. జీడిపప్పు సరఫరా చేసేందుకు కాశీబుగ్గ పారిశ్రామికవాడలోని ఎస్‌ఎస్‌ఎస్‌ ఇంటర్నేషనల్‌ ఆగ్రో ఉత్పత్తుల సంస్థకు ఇటీవల టెండర్‌ ఖరారైంది. ఈ మేరకు 10 టన్నుల సరకును పంపించారు. నాణ్యతలో రాజీపడకుండా మేలురకం పంపిస్తామని సంస్థ యజమాని సంతోష్‌కుమార్‌ ఈ సందర్భంగా తెలిపారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల


 rajesh pande