: హైజంప్‌లో భారత్ కు 2 పతకాలు..
దిల్లీ. హైజంప్‌లో భారత్ కు 2 పతకాలు.., 4 సెప్టెంబర్ (హి.స.)సెప్టెంబర్ 3న (మంగళవారం) పారిస్ పారాలింపిక్స్ 2024 లో హైజంప్ T-42 విభాగంలో భారత్ ఒక రజత పతకాన్ని, కాంస్య పతకాన్ని గెలుచుకుంది. శరద్ కుమార్ భారత్‌కు రజత పతకాన్ని అందించగా, మరియప్పన్ తంగవేలు క
: హైజంప్‌లో భారత్ కు 2 పతకాలు..


దిల్లీ. హైజంప్‌లో భారత్ కు 2 పతకాలు.., 4 సెప్టెంబర్ (హి.స.)సెప్టెంబర్ 3న (మంగళవారం) పారిస్ పారాలింపిక్స్ 2024 లో హైజంప్ T-42 విభాగంలో భారత్ ఒక రజత పతకాన్ని, కాంస్య పతకాన్ని గెలుచుకుంది. శరద్ కుమార్ భారత్‌కు రజత పతకాన్ని అందించగా, మరియప్పన్ తంగవేలు కాంస్య పతకాన్ని సాధించాడు. ఈ గేమ్‌లో అమెరికాకు చెందిన ఎజ్రా ఫ్రెచ్ స్వర్ణ పతకాన్ని గెలుచుకున్నాడు. అతను 1.94 మీటర్ల దూరంతో కొత్త పారాలింపిక్ రికార్డును కూడా సృష్టించాడు. ఇక ఈ ఈవెంట్ లో 32 ఏళ్ల శరద్ ఫైనల్ మ్యాచ్‌లో 1.88 మీటర్ల ఎత్తు జంప్ చేసి రజత పతకం సాధించాడు. మరోవైపు మరియప్పన్ 1.85 మీటర్ల ఎత్తుతో మూడో స్థానంలో నిలిచి కాంస్య పతకాన్ని కైవసం చేసుకున్నాడు. ఇకపోతే మరియప్పన్ వరుసగా 3 పారాలింపిక్స్‌లో పతకాలు సాధించిన తొలి భారతీయ ఆటగాడిగా నిలిచాడు.

---------------

హిందూస్తాన్ సమచార్ / నాగరాజ్ రావు


 rajesh pande