హైదరాబాద్, 4 సెప్టెంబర్ (హి.స.) ములుగులో 500 ఎకరాల్లో చెట్లు నెలకొరగడంపై మంత్రి సీతక్క ఆరా తీశారు. రాష్ట్ర సచివాలయం నుంచి పీసీసీఎఫ్, డీ ఎఫ్ ఓలతో మంత్రి సీతక్క టెలిఫోన్ లో మాట్లాడారు. రెండు రోజుల క్రితమే చెట్లు నెలకొరిగిన ప్రాంతాన్ని సందర్శించారు. లక్ష చెట్ల వరకు నెలకూలడం పట్ల మంత్రి విస్మయం చెందారు. ఈ స్థాయిలో అటవి విద్వంసం జరగడం పట్ల ఆశ్చర్యం కలిగించిందని తెలిపారు. అనంతరం సీతక్క మాట్లాడుతూ.. ములుగు అడవుల్లో సుడిగాలి వల్ల లక్ష చెట్ల వరకు నెలకొరిగాయని, వందల ఎకరాల్లో నష్టం వాటిల్లిందన్నారు. వృక్షాలు కూలడంపై విచారణకు ఆదేశించామని తెలిపారు. డ్రోన్ కెమెరాల సహాయంతో జరిగిన నష్టాన్ని అంచనా వేయాలని ఆదేశాలు జారీ చేశామన్నారు.
నేడు ఘటన ప్రాంతాన్ని సందర్శించి పిసిసిఎఫ్ నివేదిక సిద్ధం చేస్తారన్నారు. అడవిలో సుడిగాలి వచ్చింది కాబట్టి ప్రాణనష్టం జరగలేదన్నారు. ఈ సుడిగాలి గ్రామాల్లో సంభవించి ఉంటే పెను విధ్వంసం జరిగేదని తెలిపారు
---------------
హిందూస్తాన్ సమచార్ / నాగరాజ్ రావు