అవసరమైన ప్రత్యేక కృత్రిమ మేధ (ఏఐ) ఆధారిత టూల్స్‌ ను దేశీయంగానే అభివృద్ధి - గౌతమ్‌ అదానీ
ఢిల్లీ.29, డిసెంబర్ (హి.స.) : మన దేశ సమస్యల పరిష్కారానికి అవసరమైన ప్రత్యేక కృత్రిమ మేధ (ఏఐ) ఆధారిత టూల్స్‌ ను దేశీయంగానే అభివృద్ధి చేసుకోవాలని అదానీ గ్రూప్‌ చైర్మన్‌ గౌతమ్‌ అదానీ కోరారు. లేకపోతే మన డేటా, ఉద్యోగాలు, ఆలోచనలు, సంస్కృతి విదేశీ కంపెనీ
అవసరమైన ప్రత్యేక కృత్రిమ మేధ (ఏఐ) ఆధారిత టూల్స్‌ ను దేశీయంగానే అభివృద్ధి - గౌతమ్‌ అదానీ


ఢిల్లీ.29, డిసెంబర్ (హి.స.) : మన దేశ సమస్యల పరిష్కారానికి అవసరమైన ప్రత్యేక కృత్రిమ మేధ (ఏఐ) ఆధారిత టూల్స్‌ ను దేశీయంగానే అభివృద్ధి చేసుకోవాలని అదానీ గ్రూప్‌ చైర్మన్‌ గౌతమ్‌ అదానీ కోరారు. లేకపోతే మన డేటా, ఉద్యోగాలు, ఆలోచనలు, సంస్కృతి విదేశీ కంపెనీల ఏఐ ఆధారిత టూల్స్‌ దయాదాక్షిణ్యాలపై ఆధారపడే ప్రమాదం ఉందని హెచ్చరించారు. ఆర్థికంగా కూడా ఇది మన దేశానికి ఏ మాత్రం మంచిది కాదన్నారు. దాదాపు 140 కోట్ల జనాభా ఉన్న మన దేశం లాంటి దేశానికి ఇది ఏ మాత్రం తగదన్నారు. మహారాష్ట్రలో బారామతి వద్ద ఏర్పాటైన ‘శరద్‌ పవార్‌ సెంటర్‌ ఫర్‌ ఎక్స్‌లెన్స్‌ ఇన్‌ ఏఐ’ను ప్రారంభిస్తూ ఆయన ఈ హెచ్చరిక చేశారు.

ఆ దశ దాటిపోయింది: ఏఐ ప్రస్తుతం ఆవిష్కరణల దశ దాటిపోయిందని అదానీ స్పష్టం చేశారు. ప్రపంచ ఆధిపత్యం కోసం జరుగుతున్న పోరులో ఏఐ ప్రస్తుతం కీలక శక్తిగా మారిందన్నారు. ఏఐ ఆధిపత్యం కోసం ప్రస్తుతం చైనా-అమెరికా మధ్య జరుగుతున్న పోరును గుర్తు చేశారు. సెమీకండక్టర్లు వ్యూహాత్మక ఆస్తులుగా, డేటా కేంద్రాలు కీలక మౌలిక సదుపాయాల కేంద్రాలుగా మారాయన్నారు. మనకంటూ సొంత ఏఐ టూల్స్‌ను అభివృద్ధి చేసుకోకపోతే విదేశీ కంపెనీలు మనల్ని ఆర్ధికంగానూ కొల్లగొట్టే ప్రమా దం ఉందని అదానీ హెచ్చరించారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ


 rajesh pande