
ఢిల్లీ.29, డిసెంబర్ (హి.స.) రష్యా-ఉక్రెయిన్ యుద్ధంలో రష్యన్ ఆర్మీలో చేరిన భారతీయుల దుస్థితి మరోసారి వెలుగులోకి వచ్చింది. పంజాబ్‌కు చెందిన జగ్దీప్ కుమార్ అనే వ్యక్తి, తన తమ్ముడు మందీప్ కుమార్‌ను వెతుక్కుంటూ రష్యాకు వెళ్లి తిరిగివచ్చాడు. రష్యన్ ఆర్మీ జారీ చేసిన డాక్యుమెంట్ల ఆధారంగా కనీసం 10 మంది భారతీయులు యుద్ధంలో మరణించారని, మరో నలుగురు కనిపించకుండాపోయారని ఆయన ఆరోపించాడు.
మృతుల్లో ముగ్గురు పంజాబ్‌కు చెందినవారు, మిగతా ఏడుగురు ఉత్తరప్రదేశ్, జమ్మూ ప్రాంతాల నుంచి ఉన్నారని ఆయన తెలిపారు. ఉద్యోగ ఆశతో ట్రావెల్ ఏజెంట్లు మోసం చేసి రష్యాకు పంపి, అక్కడ బలవంతంగా ఆర్మీలో చేర్చారని జగ్దీప్ చెప్పారు. తన తమ్ముడు మందీప్‌ను 2024 మార్చి తర్వాత సంప్రదించలేదన్నారు. ఈ విషయాన్ని ఆప్ రాజ్యసభ ఎంపీ బల్బీర్ సింగ్ సీచేవాల్‌కు తెలియజేశాడు జగ్దీప్. దీంతో ఎంపీ.. విదేశాంగ మంత్రి జయశంకర్‌ను కలిసి జోక్యం చేసుకోవాలని కోరారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ