
డిల్లీ, 29 డిసెంబర్ (హి.స.)
లోక్సభ ప్రతిపక్ష నాయకుడు, కాంగ్రెస్
ఎంపీ రాహుల్ గాంధీ ఈరోజు రక్షణ రంగ పార్లమెంటరీ స్థాయి సంఘం సమావేశానికి హాజరయ్యారు. బీజేపీ ఎంపీ రాధా మోహన్ సింగ్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో, మాజీ సైనికుల (ESM) సంక్షేమంపై కీలక చర్చలు జరిగాయి. ముఖ్యంగా మాజీ సైనికులకు అందుతున్న వైద్య సదుపాయాలు, వారి పునరావాస విధానాల సమీక్ష, పదవి విరమణ తర్వాత వారికి లభిస్తున్న ఉపాధి అవకాశాల వంటి అంశాలపై కమిటీ ప్రధానంగా దృష్టి సారించింది.
హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ రావు