
హైదరాబాద్, 29 డిసెంబర్ (హి.స.)
ఐపీఎల్ వ్యవస్థాపకుడు లలిత్ మోడీ
భారత ప్రభుత్వానికి క్షమాపణలు చెప్పారు. ఈమేరకు తన ఎక్స్ వేదికగా పోస్టు చేసారు. కాగా విజయ్ మాల్యా 70వ పుట్టినరోజు పార్టీలో తీసిన వీడియోలో, లలిత్ మోడీ మాల్యాను భారత్ నుంచి పారిపోయిన అతిపెద్ద పలాయనవాదులం అంటూ వెటకారం చేయడం వివాదానికి దారి తీసింది. ఈ వీడియో ఇన్స్టాగ్రామ్లో వైరల్ కావడంతో తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి. దీనిపై స్పందించిన లలిత్ మోడీ, తన మాటలు తప్పుగా అర్థం చేసుకున్నారని, ఎవరి భావాలను గాయపరచాలనే ఉద్దేశం లేదని, భారత ప్రభుత్వానికి తనకు పూర్తి గౌరవం ఉందని చెబుతూ క్షమాపణలు తెలిపారు. ఇదే సమయంలో విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ కూడా స్పందిస్తూ.. పరారీలో ఉన్నవారిని తిరిగి తీసుకొచ్చి న్యాయస్థానాల ముందు నిలబెట్టేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని స్పష్టం చేసింది.
---------------
హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ రావు