తెలంగాణ, నిర్మల్. 21 జనవరి (హి.స.)
సంక్షేమ పథకాల అమలు
నిరంతర ప్రక్రియగా కొనసాగుతుందని నిర్మల్ జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ స్పష్టం చేశారు. మంగళవారం నిర్మల్ పట్టణంలోని నాయిడివాడ, నిర్మల్ గ్రామీణ మండలం న్యూ పోచంపాడ్ గ్రామంలో నిర్వహిస్తున్న ప్రజా పాలన వార్డు, గ్రామ సభలలో కలెక్టర్ పాల్గొని ప్రజలకు, అధికారులకు పలు సూచనలు చేసారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఈ నెల 26 నుండి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేయనున్న రైతు భరోసా, ఇందిరమ్మ ఇళ్లు, ఆహార భద్రత (రేషన్) కార్డులు, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకాల గురించి గ్రామస్తులకు వివరించారు. ఈ పథకాల కింద అర్హులను గుర్తించేందుకు వీలుగా క్షేత్రస్థాయి నిర్వహించడం జరిగిందని గుర్తు చేశారు. పరిశీలన
ముఖ్యంగా సాగుకు యోగ్యమైన భూములను పక్కాగా నిర్ధారించామని అన్నారు. పంటలు సాగు చేస్తున్న ప్రతి రైతుకు ప్రభుత్వం రైతు భరోసా పథకం కింద ఎకరానికి 12 వేల రూపాయల చొప్పున పెట్టుబడి సాయం అందిస్తుందని తెలిపారు. అదే విధంగా సాగు భూమి లేని వ్యవసాయ కూలీ కుటుంబాలకు ఇందిరమ్మ ఆత్మీయ భరోసా కింద రెండు విడతల్లో 12 వేల రూపాయలు అందించడం జరుగుతుందన్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు, జర్నలిస్ట్