సూర్యాపేట, 12 అక్టోబర్ (హి.స.)
సూర్యాపేట జిల్లా తుంగతుర్తిలో
నిర్వహించిన మాజీ మంత్రి రాంరెడ్డి దామోదర్ రెడ్డి సంస్మరణ సభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. దామోదర్ రెడ్డి చిత్రపటానికి పూలమాల వేసి నివాళ్లు అర్పించారు. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. నల్లగొండలో గోదావరి నీళ్లు ప్రవహిస్తున్నాయంటే అందుకు కారణం దామోదర్ రెడ్డినే అని అన్నారు. అందుకే ఆయనకు గుర్తుగా ఎస్సారెస్పీకి రాంరెడ్డి దామోదర్ రెడ్డి పేరు పెడుతున్నట్లు కీలక ప్రకటన చేశారు. ఎస్సీరెస్పీ-2కి ఆర్డీఆర్ అని నామకరణం చేస్తున్నట్లు తెలిపారు. దీనిపై 24 గంటల్లోనే జీవో తీసుకొస్తామని అన్నారు. దామోదర్ రెడ్డి కుటుంబానికి అన్ని విధాలా అండగా ఉంటామని భరోసా ఇచ్చారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు