హైదరాబాద్, 12 అక్టోబర్ (హి.స.) తెలంగాణలో పత్తి సేకరణ పై రాష్ట్ర వ్యవసాయ, మార్కెటింగ్ శాఖల
అధికారులుతో మంత్రి తుమ్మల నాగేశ్వర రావు ఆదివారం సమీక్షా సమావేశం నిర్వహించారు. CCI ఆహ్వానించిన టెండర్లును ఈనెల 10వ తేదీన ఓపెన్ చేసినట్లు, వాటిలో మొత్తం 328 జిన్నింగ్ మిల్లులు పాల్గొన్నాయని, టెక్నికల్ టెండర్లు నిన్నటికి పూర్తయ్యాయని మార్కెటింగ్ శాఖల అధికారులు మంత్రికి తెలిపారు. ఈ సందర్భంగా మంత్రి తుమ్మల మాట్లాడుతూ, టెండర్ల ప్రక్రియ పూర్తవ్వగానే సంబంధిత జిన్నింగ్ మిల్లుల జాబితాను జిల్లా కలెక్టర్లకు తెలియజేయాలని, తరువాత ఆయా మిల్లులను పత్తి కొనుగోలు కేంద్రాలుగా నోటిఫై చేసే ప్రక్రియను వేగవంతం చేయాలని సూచించారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..