నవీన్ యాదవ్కు పూర్తి మద్దతు తెలిపిన అజారుద్దీన్
హైదరాబాద్, 12 అక్టోబర్ (హి.స.) జూబ్లీహిల్స్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి వి. నవీన్ యాదవ్ మాజీ ఎంపీ, ఎమ్మెల్సీ అజారుద్దీన్ తో భేటీ అయ్యారు. ఆదివారం బంజారాహిల్స్లోలోని ఆయన నివాసంలో నవీన్ యాదవ్, ఎమ్మెల్సీ బల్మురి వెంకట్తో కలిసి మర్యాద పూర్వక
అజరుద్దీన్


హైదరాబాద్, 12 అక్టోబర్ (హి.స.)

జూబ్లీహిల్స్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే

అభ్యర్థి వి. నవీన్ యాదవ్ మాజీ ఎంపీ, ఎమ్మెల్సీ అజారుద్దీన్ తో భేటీ అయ్యారు. ఆదివారం బంజారాహిల్స్లోలోని ఆయన నివాసంలో నవీన్ యాదవ్, ఎమ్మెల్సీ బల్మురి వెంకట్తో కలిసి మర్యాద పూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ...పార్టీ గెలుపే లక్ష్యంగా పనిచేస్తున్నమన్నారు. ప్రతి పక్షాలు అనేక రకాల విమర్శలు చేస్తారు. వాటిని పరిగణంలోకి తీసుకోకుండా జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలుపు కోసం కృషి చేస్తున్నామని తెలిపారు.

నవీన్ యాదవ్కు తన పూర్తి మద్దతు తెలుపుతూ, నియోజకవర్గంలో నవీన్ యాదవ్తో ప్రతీ డివిజన్ తిరిగి ప్రచారంలో పాల్గొంటాను అని అజారుద్దీన్ అన్నారు. ప్రతీ ఒక్కరు కాంగ్రెస్ గెలుపుకు కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ బల్మురి వెంకట్, కాంగ్రెస్ నాయకులు నాగార్జునరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ రావు


 rajesh pande