మెదక్, 12 అక్టోబర్ (హి.స.)
మెదక్ జిల్లాలోని వెల్దుర్తి మండల పరిధిలోని దామరంచ గ్రామ అటవీ ప్రాంతంలో అవుట్ స్కార్ట్స్ వద్ద కొందరు వ్యక్తులు పేకాట ఆడుతున్నారనే సమాచారం మేరకు దాడి నిర్వహించామని సీఐ రంగకృష్ణ తెలిపారు. జూదం ఆడుతున్న ముగ్గురు వ్యక్తులను అదుపులోకి తీసుకుని వారి నుండి 5 మోటార్ల సైకిల్స్ 8 బైక్ లు 3,29,500 నగదు స్వాధీనం చేసుకున్నట్టు తెలిపారు. సేకరించిన ఆధారాల ద్వారా ప్రధానంగా పరారీలో ఉన్న వివరాలను సేకరించి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. జూదం ఆడుతున్న గ్రామీణ ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి సారించి పర్యవేక్షణ చేపడుతామని వారు ఈ సందర్భంగా తెలిపారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ రావు