స్థానిక ఎన్నికలపై రేపు సుప్రీంకోర్టుకు తెలంగాణ సర్కార్..
హైదరాబాద్, 12 అక్టోబర్ (హి.స.) స్థానిక ఎన్నికల్లో బీసీలకు 42శాతం రిజర్వేషన్లు అమలు చేస్తూ తెలంగాణ ప్రభుత్వం తీసుకువచ్చిన జీవో నంబర్ 9పై హైకోర్టు స్టే విధించిన సంగతి తెలిసిందే. అయితే దీనిపై రేవంత్ సర్కార్ రేపు సుప్రీంకోర్టుకు వెళ్లనుంది. కోర్టులో
సుప్రీం కోర్ట్


హైదరాబాద్, 12 అక్టోబర్ (హి.స.)

స్థానిక ఎన్నికల్లో బీసీలకు 42శాతం

రిజర్వేషన్లు అమలు చేస్తూ తెలంగాణ ప్రభుత్వం తీసుకువచ్చిన జీవో నంబర్ 9పై హైకోర్టు స్టే విధించిన సంగతి తెలిసిందే. అయితే దీనిపై రేవంత్ సర్కార్ రేపు సుప్రీంకోర్టుకు వెళ్లనుంది. కోర్టులో ప్రభుత్వం తరపున పిటిషన్ దాఖలు చేయాలని నిర్ణయం తీసుకుంది. అంతే కాకుండా ప్రభుత్వం తరపున ఢిల్లీకి మంత్రులు పొన్నం ప్రభాకర్, వాకాటి శ్రీహరిని పంపే ఆలోచనలో ఉన్నట్టు సమాచారం.

మరోవైపు మహేశ్ కుమార్ గౌడ్ సైతం రేపు ఢిల్లీకి వెళతారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఇదిలా ఉంటే స్థానిక ఎన్నికల నోటిఫికేషన్ వచ్చిన తరవాత హైకోర్టులో రిజర్వేషన్ల విషయమై ప్రభుత్వానికి చుక్కెదురైంది. దీంతో సుప్రీంకోర్టులో ఎలాంటి తీర్పు వస్తుంది అన్నదానిపై సర్వత్రా ఆసక్తినెలకొంది. మరోవైపు ఎన్నికలు ఎప్పుడు వస్తాయి? రిజర్వేషన్లలో ఏమైనా మార్పులు చేర్పులు ఉంటాయా? అనేదానిపై స్పష్టత లేకపోవడంతో అభ్యర్థులు ఆందోళన చెందుతున్నారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..


 rajesh pande