జూబ్లీహిల్స్ ఎన్నిక. ఓకే ఇంట్లో 43 ఓట్లు.. విచారణకు ఆదేశించిన ఎన్నికల కమిషన్
హైదరాబాద్, 13 అక్టోబర్ (హి.స.) జూబ్లీహిల్స్ లో బోగస్ ఓట్లు కలకలం సృష్టించాయి. ఒకే ఇంటి నంబర్పై 43 ఓట్లు ఉన్నాయని బీఆర్ఎస్ నాయకులు బయటపెట్టారు. దీంతో ఈ కేసును ఎన్నికల కమిషన్ సుమోటోగా తీసుకుంది. దీనిపై విచారణ జరపాలని ఎన్నికల అధికారి, జీహెచ్ఎంసీ కమిష
జూబ్లీహిల్స్


హైదరాబాద్, 13 అక్టోబర్ (హి.స.)

జూబ్లీహిల్స్ లో బోగస్ ఓట్లు కలకలం సృష్టించాయి. ఒకే ఇంటి నంబర్పై 43 ఓట్లు ఉన్నాయని బీఆర్ఎస్ నాయకులు బయటపెట్టారు. దీంతో ఈ కేసును ఎన్నికల కమిషన్ సుమోటోగా తీసుకుంది. దీనిపై విచారణ జరపాలని ఎన్నికల అధికారి, జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్వీ కర్ణన్ ఆదేశించారు.

జూబ్లీహిల్స్ నియోజకవర్గ పరిధిలోని యూసుఫ్గూడ డివిజన్ కృష్ణానగర్ బీ-బ్లాక్ లో బూత్ నంబర్ 246లోని ఓటరు జాబితాను బీఆర్ఎస్ బూత్ ఇన్చార్జీలు పరిశీలించారు. ఆ జాబితా ప్రకారం ఓటర్లు ఉన్నారా? లేరా? అని తెలుసుకునేందుకు సంస్కృతి అవెన్యూ అపార్ట్మెంట్కు వెళ్లారు. 8-3-231/బీ/160 నంబర్తో ఉన్న ఆ అపార్ట్మెంట్లో నూతన ఓటర్ల జాబితా ప్రకారం మొత్తం 43 మంది ఓటర్లున్నారు. వారంతా అపార్ట్మెంట్లో నివసిస్తున్నారా? లేరా? అని ఆరా తీస్తే విస్తుపోయే నిజాలు బయటపడ్డాయి. ఓటరు జాబితాలోని ఓటర్ క్రమసంఖ్య 1006 నుంచి 1048 వరకు ఉన్న 43 మందిలో ఇద్దరు తప్ప మిగిలిన వారెవరూ అక్కడ లేరని తేలింది.

---------------

హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ రావు


 rajesh pande