రామ్ చరణ్ దంపతులపై ప్రధాని మోదీ ప్రశంసలు
హైదరాబాద్, 13 అక్టోబర్ (హి.స.) స్టార్ కపుల్స్ రామ్ చరణ్, ఉపాసన దంపతులను ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ప్రశంసించారు. భారతదేశంలో ప్రాచీన క్రీడ అయిన ఆర్చరీకి తిరిగి ప్రాచుర్యం కల్పించేందుకు వారు చేస్తున్న సేవలను అభినందించారు. వారితోపాటూ ఆర్చరీ ప్రీమియ
పీఎం మోడీ


హైదరాబాద్, 13 అక్టోబర్ (హి.స.)

స్టార్ కపుల్స్ రామ్ చరణ్, ఉపాసన దంపతులను ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ప్రశంసించారు. భారతదేశంలో ప్రాచీన క్రీడ అయిన ఆర్చరీకి తిరిగి ప్రాచుర్యం కల్పించేందుకు వారు చేస్తున్న సేవలను అభినందించారు. వారితోపాటూ ఆర్చరీ ప్రీమియర్ లీగ్ చైర్మన్ అనిల్ కామినేని కృషిని కూడా ప్రధాని ప్రశంసించారు. ఈ మేరకు మోదీ ఎక్స్ (ట్విట్టర్) వేదికగా పోస్టు పెట్టారు.

రామ్ చరణ్, ఉపాసన దంపతులు అనిల్ కామినేని సారథ్యంలో వరల్డ్ ఆర్చరీ ప్రీమియర్ లీగ్ నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో రెండు రోజుల క్రితం వీరు ప్రధాని మోదీని కలిశారు. ప్రధానితో సమావేశమైన చరణ్, ఉపాసన, అనిల్ కామినేనిలు లీగ్ కు సంబంధించిన వివరాలను ఆయనకు వివరించారు. ఈ సందర్భంగా శ్రీ వేంకటేశ్వరస్వామి జ్ఞాపికతో పాటు, ప్రత్యేకంగా తయారు చేయించిన విల్లును మోదీకి అందించారు. ఇందుకు సంబంధించిన ఫొటోలను కూడా సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ రావు


 rajesh pande