వెస్ట్ బెంగాల్.13 అక్టోబర్ (హి.స.)
వెస్ట్ బెంగాల్ రాష్ట్రం దుర్గాపూర్ లోని ఓ ప్రైవేట్ మెడికల్ కాలేజీ లో ఎంబీబీఎస్ సెకండియర్ చదువుతున్న విద్యార్థిని పై ఇటీవల కొందరు యువకులు అత్యాచారానికి పాల్పడ్డారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
నిందితుల్లో ముగ్గురిని ఆదివారం ఉదయం అరెస్ట్ చేశారు. మరో నిందితుడు ఆదివారం రాత్రి పట్టుబడ్డాడు. తాజాగా సోమవారం మధ్యాహ్నం ఇంకో నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. దాంతో ఈ కేసులో ఇప్పటివరకు పోలీసులు అరెస్ట్ చేసిన నిందితుల సంఖ్య ఐదుకు చేరింది. ఈ విషయాన్ని అసన్సోల్ దుర్గాపూర్ పోలీస్ కమిషనర్ కార్యాలయం వెల్లడించింది.
అయితే అరెస్టయిన నిందితుల వివరాలను పోలీసులు ఇంకా బయటికి వెల్లడించలేదు.
---------------
హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ రావు